డెల్‌లో 6,650 మందికి ఉద్వాసన

ABN , First Publish Date - 2023-02-07T02:42:13+05:30 IST

పర్సనల్‌ కంప్యూటర్లకు డిమాండ్‌ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో డెల్‌ టెక్నాలజీస్‌ 6,650 మందికి ఉద్వాసన పలకనుంది...

డెల్‌లో 6,650 మందికి ఉద్వాసన

పర్సనల్‌ కంప్యూటర్లకు డిమాండ్‌ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో డెల్‌ టెక్నాలజీస్‌ 6,650 మందికి ఉద్వాసన పలకనుంది. ప్రపంచవ్యాప్తంగా డెల్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో తొలగింపునకు గురవుతున్న వారు 5 శాతం ఉంటారు. అస్థిర భవిష్యత్తు కారణంగా మార్కెట్‌ పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జెఫ్‌ క్లార్కే ఉద్యోగులకు పంపిన సందేశంలో తెలిపారు. దీంతో తాము ఈ చర్య తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. గతంలో చేపట్టిన కొత్త నియామకాల నిలిపివేత, ప్రయాణ పరిమితులు వంటి వ్యయ నియంత్రణ చర్యలు చాలవని ఆయన తేల్చిచెప్పారు. అయితే ఉద్యోగుల తొలగింపు వార్తలపై డెల్‌ టెక్నాలజీస్‌ స్పందించలేదు.

600 మంది ఫ్రెషర్లకు ఇన్ఫీ గుడ్‌బై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వందలాది మంది ఫ్రెషర్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇంటర్నల్‌ ఫ్రెషర్‌ అసె్‌సమెంట్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ కావడంతో ఈ చర్య తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇలా టెర్మినేట్‌ చేసిన వారి సంఖ్య 600 వరకు ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-07T02:42:15+05:30 IST