Share News

వచ్చే రెండేళ్లలో రూ.650 కోట్ల ఆదాయం

ABN , Publish Date - Dec 22 , 2023 | 04:36 AM

హైదరాబాద్‌, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రొడక్ట్‌ కంపెనీ ఎవల్యూటిజ్‌ భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా మరింత మంది...

వచ్చే రెండేళ్లలో రూ.650 కోట్ల ఆదాయం

ఎవల్యూటిజ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రొడక్ట్‌ కంపెనీ ఎవల్యూటిజ్‌ భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా మరింత మంది నిపుణులను నియమించుకోనుంది. చికాగోకు చెందిన ఎవల్యూటిజ్‌కు భారత్‌లో 650 మంది నిపుణులు ఉంటే హైదరాబాద్‌, విశాఖల్లోనే 500 మంది ఉన్నారని కంపెనీ వ్యవస్థాపకుడు, సీటీఓ ఏ శ్రీనివాస తెలిపారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా టెక్నాలజీల్లో అడ్వాన్స్‌డ్‌ ప్రొడక్ట్స్‌, ప్లాట్‌ఫామ్స్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్‌ రూ.430 కోట్లు ఉండగా.. వచ్చే రెండేళ్లలో రూ.650 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Updated Date - Dec 22 , 2023 | 04:36 AM