Share News

ధనలక్ష్మీ బ్యాంక్‌ లాభంలో 45% వృద్ధి

ABN , First Publish Date - 2023-11-10T02:02:48+05:30 IST

ధనలక్ష్మీ బ్యాంక్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన రూ.23.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

ధనలక్ష్మీ బ్యాంక్‌ లాభంలో 45% వృద్ధి

ముంబై: ధనలక్ష్మీ బ్యాంక్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను స్టాండ్‌అలోన్‌ ప్రాతిపదికన రూ.23.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.15.89 కోట్లు)తో పోల్చి తే లాభం 45.75 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.285.26 కోట్ల నుంచి రూ.327.43 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 3.88 శాతం వృద్ధి చెంది రూ.120.96 కోట్లుగా నమోదైంది.

Updated Date - 2023-11-10T02:02:51+05:30 IST