డిజిట్‌ నుంచి 3 హెల్త్‌ ప్లాన్స్‌

ABN , First Publish Date - 2023-03-26T04:12:37+05:30 IST

డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. డిజిట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కింద కొత్తగా 3 ప్లాన్స్‌ను విడుదల చేసింది. డిజిట్‌ డబుల్‌ వ్యాలెట్‌ ప్లాన్‌, డిజిట్‌ ఇన్ఫినిటీ వ్యాలెట్‌ ప్లాన్‌...

డిజిట్‌ నుంచి 3 హెల్త్‌ ప్లాన్స్‌

డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. డిజిట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కింద కొత్తగా 3 ప్లాన్స్‌ను విడుదల చేసింది. డిజిట్‌ డబుల్‌ వ్యాలెట్‌ ప్లాన్‌, డిజిట్‌ ఇన్ఫినిటీ వ్యాలెట్‌ ప్లాన్‌, డిజిట్‌ వరల్డ్‌వైడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాన్‌ పేరుతో వీటిని తీసుకువచ్చింది. ఈ ప్లాన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలకమైన క్యాష్‌లెస్‌ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా రూమ్‌ రెంట్‌, ఐసీయూ చార్జీలపై ఎలాంటి పరిమితి లేదని పేర్కొంది. ఇన్ఫినిటీ వ్యాలెట్‌, వరల్డ్‌వైడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాన్‌ కింద ఏటా ఎలాంటి క్లెయిమ్స్‌ను చేయని పక్షంలో క్యుములేటివ్‌ బోనస్‌ కింద 50 శాతం వరకు సమ్‌ ఇన్సూర్‌ మొత్తాన్ని పాలసీదారులకు అందించనున్నట్లు డిజి ట్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. వరల్డ్‌వైడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాన్‌ కింద భారత్‌ సహా ప్రపంచంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ భారత్‌లో ఏదైనా వ్యాధిని గుర్తించిన్పపటికీ విదేశాల్లో చికిత్స చేయించుకునే వెసులుబాటు ఈ ప్లాన్‌లో ఉందని తెలిపింది.

Updated Date - 2023-03-26T04:12:37+05:30 IST