2000 Note: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోటు మన వద్ద ఉంటే.. జైల్లో వేస్తారా..? జరిమానా విధిస్తారా..?

ABN , First Publish Date - 2023-09-28T11:34:27+05:30 IST

రూ. 2 వేల నోట్లను డిపాటిజ్ చెయ్యడం లేదా మార్చుకోవడానికి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అక్ోబర్ 1నుండి 2వేల నోటు ఎవరిదగ్గరైనా కనబడితే జరిగేది ఇదే..

2000 Note: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోటు మన వద్ద ఉంటే.. జైల్లో వేస్తారా..? జరిమానా విధిస్తారా..?

నోట్లరద్దు ప్రజలను ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెడుతోంది. ఈ ఏడాది మే 19వ తేదీన భారతీయ కరెన్సీలో అతిపెద్ద నోటు అయిన 2వేల నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. మే 23వ తేదీ నుండి 2వేల నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది. అయితే ఈ నోట్ల మార్పిడికి చివరి గడువు సెప్టెంబర్ 30 కావడం గమనార్హం. ఈ నెల ముగింపుతో 2వేల నోటు మార్పిడికి సమయం కూడా ముగుస్తుంది. సెప్టెంబర్ 30 తరువాత రూ. 2వేల నోటు ఎవరివద్ద అయినా ఉంచుకుంటే జైల్లో వేస్తారా? జరిమానా విధిస్తారా? అసలు చెల్లని నోట్లు ఉంచుకుంటే జరిగేదేంటి? ఆర్భీఐ నియమనిబంధనలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

2016 సంవత్సం నవంబర్ 9వ తేదీ అర్థరాత్రి నుండి రూ. 500, 1000రూపాయల నోట్లను రద్దు(demonetisation) చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నోట్ల రద్దు తరువాత నవంబర్ 10వ తేదీన రిజర్వ్ బ్యాంక్ రూ. 2వేల నోట్లను(2k note) విడుదల చేసింది. పింక్ నోట్ పేరుతో ఈ నోట్లు ప్రజల మధ్య ఎంతో సందడి చేశాయి. అయితే 7ఏళ్లు కూడా తిరగకుండానే ఈ ఏడాది మళ్లీ నోట్ల రద్దులో భాగంగా రిజర్వ్ బ్యాంకు రూ. 2వేల నోట్లను రద్దు చేసింది.ఎవరివద్దనైనా 2వేల నోట్లు ఉంటే వాటిని బ్యాంకులలో మార్పు చేసుకోవాలని సూచించింది. దీనికి చివరి గడువు గా సెప్టెంబర్ 30 ని పేర్కొంది(2k note deposit last date September 30). సెప్టెంబర్ 30 తరువాత, అక్టోబర్ 1 నుండి ఎవరైనా 2వేల నోట్లను తమ వద్ద ఉంచుకుంటే అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందా అంటే అవుననే అంటున్నారు. 2016లో నోట్ల రద్దు జరిగిన తరువాత రూ. 500, 1000 నోట్లను ఎవరైన ఉంచుకున్నట్టు బయటపడితే వారికి 10వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష విధించే నిబంధనను తీసుకొచ్చింది.

Fingernails: గోర్ల మాటున దాగి ఉండే ఆరోగ్య రహస్యాలు.. గోర్లు వాటంతట అవే విరిగిపోతూ ఉంటే అర్థమేంటంటే..!



2016లో ఏర్పడిన ఈ చట్టం ఇప్పుడు కూడా వర్తిస్తుందట. ఎవరివద్దనైనా 2వేల రూపాయల నోట్లు ఉన్న పక్షంలో వాటిని మూడు రోజుల లోపు మార్పు చేయించుకోవాలని చెబుతున్నారు. 2వేల నోట్ల గురించిన సమాచారం ప్రకారం 24వేల కోట్లు విలువ చేసే 2వేల రూపాయల నోట్లు ఇంకా వాపస్ రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నోట్ల మార్పిడి లేదా నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి సమయాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Viral News: ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసు తల్లీ.. 5 ఏళ్ల ఈ పాప ఎందుకిలా జుట్టునంతా తీసేయించిందంటే..!


Updated Date - 2023-09-28T11:34:27+05:30 IST