టాప్‌గేర్‌లో ‘ఆటో’ అమ్మకాల్లో 11 శాతం వృద్ధి

ABN , First Publish Date - 2023-03-02T01:46:09+05:30 IST

ఆటోమొబైల్‌ అమ్మకాలు జనవరిలో జోరందుకున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 3.35 లక్షల వాహనాలు టోకుగా అమ్ముడుపోయాయి....

టాప్‌గేర్‌లో ‘ఆటో’ అమ్మకాల్లో 11 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : ఆటోమొబైల్‌ అమ్మకాలు జనవరిలో జోరందుకున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 3.35 లక్షల వాహనాలు టోకుగా అమ్ముడుపోయాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే అమ్మకాల్లో 11 శాతం వృద్ధి నమోదయింది. ఒక ఏడాదిలో ఫిబ్రవరి నెలలో నమోదైన గరిష్ఠ అమ్మకాల రికార్డు ఇదే. మారుతి, హ్యుండై, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలు దేశీయ అమ్మకాల్లో మంచి వృద్ధిని ప్రకటించాయి. అయితే ఎంజీ మోటార్స్‌ మాత్రం అమ్మకాల్లో 7 శాతం క్షీణతను నమోదు చేసింది. నెల మొత్తంలో 4528 కార్లు మాత్రమే విక్రయించింది. మారుతి సుజుకి 1,55,114 కార్లు విక్రయించింది. మినీ సెగ్మెంట్‌లోని ఆల్టో, ఎస్‌ప్రెసో కార్లు 21,875, కాంపాక్ట్‌ విభాగంలోని బాలెనో, సెలీరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, టూర్‌ ఎస్‌, వ్యాగన్‌ ఆర్‌ కార్లు 78,898 అమ్ముడుపోయాయి. కాగా వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరి నెలల మధ్య కాలంలో మొత్తం అమ్మకాలు 35.5 లక్షలున్నాయని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇదే కాలంలో తాము 23 శాతం వృద్ధితో 15.08 లక్షల కార్లు విక్రయించినట్టు తెలిపారు. ఇప్పటికీ చిప్‌ల కొరత ఉత్పత్తికి అవరోధంగానే ఉన్నదని ఆయన అన్నారు.

కంపెనీ అమ్మకాలు వృద్ధి(శాతం)

హ్యుండై మోటార్స్‌ 47,001 7

టాటా మోటార్స్‌ 43,140 3

మహీంద్రా 30,358 10

కియా ఇండియా 24,600 36

టీకేఎం 15,338 75

బజాజ్‌ ఆటో

ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో కూడా మంచి వృద్ధి నమోదయింది. బజాజ్‌ ఆటో 36 శాతం వృద్ధితో 1,53,291 వాహనాలు విక్రయించింది.

Updated Date - 2023-03-02T01:46:09+05:30 IST