ఇండ్‌సఇండ్ బ్యాంక్‌లోకి 10,000 కోట్ల ప్రమోటర్ల పెట్టుబడులు!
ABN , First Publish Date - 2023-06-26T01:38:11+05:30 IST
ప్రైవేట్ రంగానికి చెందిన ఇండ్‌సఇండ్ బ్యాంక్ ప్రమోటర్ అయిన హిందూజా గ్రూప్.. బ్యాంక్‌లో తన వాటాను పెంచుకోవాలనుకుంటోంది...
ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన ఇండ్‌సఇండ్ బ్యాంక్ ప్రమోటర్ అయిన హిందూజా గ్రూప్.. బ్యాంక్‌లో తన వాటాను పెంచుకోవాలనుకుంటోంది. ఇందుకోసం బ్యాంక్‌లో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం పేర్కొంది. తద్వారా బ్యాంక్‌లో హిందూజా గ్రూప్ వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 26 శాతానికి పెరగనుంది. బ్యాంక్‌లో వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు హిందూజా గ్రూప్‌నకు చెందిన ఇండ్‌సఇండ్ ఇంటర్నేషనల్‌కు ఆర్‌బీఐ ఈ ఏడాది తొలినాళ్లలోనే షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ద్వితీయార్ధం (అక్టోబరు-మార్చి) లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా.