Share News

పేటీఎంలో 1,000 మంది ఔట్‌

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:27 AM

డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ పేటీఎంలో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మందికిపైగా ఉద్యోగులను సంస్థ తొలగించినట్టు సమాచారం.

 పేటీఎంలో 1,000 మంది ఔట్‌

మార్చిలోగా మరింత మందిపై వేటు

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ పేటీఎంలో ఉద్యోగాల కోత ప్రారంభమైంది. వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మందికిపైగా ఉద్యోగులను సంస్థ తొలగించినట్టు సమాచారం. అయితే కంపెనీ ప్రతినిధులు తొలగించిన ఉద్యోగుల సంఖ్య అంత లేదంటూనే, ఎంత మందిని తొలగించారనే విషయం చెప్పేందుకు నిరాకరించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఉద్యోగుల జీతభత్యాల బిల్లు కనీసం 10 నుంచి 15 శాతం తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. మార్చిలోపు మరిన్ని తొలగింపులు ఉంటాయని కూడా సూచనప్రాయంగా చెప్పాయి.

Updated Date - Dec 26 , 2023 | 03:27 AM