గ్రాడ్యుయేట్‌ ఓటర్లపై వైసీపీ విషం

ABN , First Publish Date - 2023-03-18T03:41:47+05:30 IST

గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ఫలితాలను వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది. రాష్ట్రంలో ‘వైనాట్‌ 175’ అంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి విద్యావంతులు చెప్పిన సమాధానం ..

గ్రాడ్యుయేట్‌ ఓటర్లపై వైసీపీ విషం

ప్రతికూల ఫలితాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ఫలితాలను వైసీపీ జీర్ణించుకోలేక పోతోంది. రాష్ట్రంలో ‘వైనాట్‌ 175’ అంటున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి విద్యావంతులు చెప్పిన సమాధానం ఆ పార్టీకి రుచించడం లేదు. సమాజాన్ని ప్రభావితం చేసే పట్టభద్రుల నాడి విస్పష్టంగా తెలియడంతో గ్రాడ్యుయేట్‌ ఓటర్లపై వైసీపీ సోషల్‌ మీడియా విషం చిమ్మింది. ‘‘గొంతెమ్మ కోర్కెలు తీర్చలేదని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన పట్టభద్రులు’’... ‘‘సీబీఎన్‌ అధికారంలో ఉంటే జీతాలు ఇవ్వకపోయినా లంచాలు తీసుకునేలా ప్రత్యామ్నాయం కల్పిస్తాడు’’... ‘‘పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు చూస్తుంటే... లంచం తీసుకునే అవకాశం ఇవ్వని వైసీపీ ప్రభుత్వంపై వాళ్లు అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తుంది’’... వంటి ట్వీట్లు వైసీపీ సోషల్‌ మీడియా ఖాతాల్లో కనిపించాయి. ప్రతికూల ఫలితాలు రాగానే ఆయా వర్గాలపై విచక్షణారహితంగా సోషల్‌ మీడియాలో బురద జల్లడంపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-18T03:41:47+05:30 IST