TDP: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
ABN , Publish Date - Dec 15 , 2023 | 06:02 PM
వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు శుక్రవారం టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు శుక్రవారం టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేల అనుచరుల సారధ్యంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. చంద్రబాబు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు.
వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధా కృష్ణయ్యతో పాటు 6 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైకాపా ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. నేతల చేరికలతో తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.