Share News

YCP: నెల్లూరు జిల్లాలో వైసీపీ మరో దారుణం

ABN , Publish Date - Dec 22 , 2023 | 10:43 AM

నెల్లూరు జిల్లాలో వైసీపీ మరో దారుణానికి ఒడిగట్టింది. దళిత డాక్టర్ మాసిలామణికి వైసీపీ షాడో ఎంపీపీగా వ్యవహరిస్తున్న వన్నిపెంట సుబ్బారెడ్డి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. రూ.10లక్షలు అప్పు కావాలని మాసిలామణిని సుబ్బారెడ్డి అడిగాడు. అప్పు ఇవ్వకపోవడంతో వేధింపులకు పాల్పడుతున్నాడు.

YCP: నెల్లూరు జిల్లాలో వైసీపీ మరో దారుణం

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైసీపీ మరో దారుణానికి ఒడిగట్టింది. దళిత డాక్టర్ మాసిలామణికి వైసీపీ షాడో ఎంపీపీగా వ్యవహరిస్తున్న వన్నిపెంట సుబ్బారెడ్డి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. రూ.10లక్షలు అప్పు కావాలని మాసిలామణిని సుబ్బారెడ్డి అడిగాడు. అప్పు ఇవ్వకపోవడంతో వేధింపులకు పాల్పడుతున్నాడు. డీఎంఅండ్‌హెచ్ఓగా పని చేసి డాక్టర్ మాసిలామణి రిటైర్ అయ్యారు. వింజమూరులో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.

అయితే ఆసుపత్రి ఎదుట వరకూ రోడ్డు నిర్మించకుండా సుబ్బారెడ్డి అడ్డుపడుతున్నాడు. ఆసుపత్రికి రావడానికి చిన్నపిల్లల తల్లిదండ్రులుకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదట. ఇటీవల సరైన సమయానికి ఆసుపత్రికి రాలేక ఓ చిన్నారి మృతి చెందింది. సుబ్బారెడ్డి షాడో ఎంపీపీగా వ్యవహరిస్తూ సైకోలా ప్రవర్తిస్తుంటాడని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Dec 22 , 2023 | 10:43 AM