Share News

బాబు పేరుతో వైసీపీ తప్పుడు ప్రచారం: వర్ల

ABN , First Publish Date - 2023-11-10T04:21:44+05:30 IST

సోషల్‌ మీడియాలో చంద్రబాబు పేరుతో వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నది ఫేక్‌ లెటర్‌ అని టీడీపీ పోలిట్‌బ్యూరో వర్ల రామయ్య స్పష్టం చేశారు. టీడీపీపై విషం

బాబు పేరుతో వైసీపీ తప్పుడు ప్రచారం: వర్ల

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో చంద్రబాబు పేరుతో వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నది ఫేక్‌ లెటర్‌ అని టీడీపీ పోలిట్‌బ్యూరో వర్ల రామయ్య స్పష్టం చేశారు. టీడీపీపై విషం చిమ్ముతూ పార్టీ శ్రేణుల్ని పక్కదారి పట్టించానికి ఫేక్‌ లెటర్‌ రాసి, ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫేక్‌ లెటర్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేసేందుకు సీఐడీ చీఫ్‌ సంజయ్‌ అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే తప్పుడు లేఖతో ప్రచారం చేస్తున్న సజ్జల తనయుడు భార్గవ్‌రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-11-10T04:21:45+05:30 IST