Share News

వెలవెలబోయిన వైసీపీ బస్సుయాత్ర

ABN , Publish Date - Dec 14 , 2023 | 03:10 AM

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం నిర్వహించిన వైసీపీ బస్సుయాత్ర వెలవెలబోయింది.

వెలవెలబోయిన వైసీపీ బస్సుయాత్ర

రోడ్డుపై సభతో జనానికి ఇక్కట్లు

పాతపట్నం, డిసెంబరు 13: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం నిర్వహించిన వైసీపీ బస్సుయాత్ర వెలవెలబోయింది. ఎమ్మెల్యే రెడ్డి శాంతి వర్గీయులు వారం రోజుల నుంచి అన్ని మండలాల నాయకులతో దఫదఫాలుగా సమావేశమై అధికంగా జనాలను తరలించాలని సూచించారు. అయినా సభకు ప్రజల నుంచి స్పందనలేదు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం ముగిసేసరికి సగానికి పైగా కుర్చీలు ఖాళీ అయ్యాయి.

Updated Date - Dec 14 , 2023 | 06:39 AM