YCP: వైసీపీ నుంచి టీడీపీలోకి మారారని..
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:43 AM
గురజాలలో వైసీపీ వర్గీయులు దాడి చేస్తున్నారని ఓ మహిళ ఆరోపించింది. కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ ఇంటిపై బాటిల్స్‌తో దాడి చేశారు. వైసీపీ నుంచి ఇటీవల టీడీపీకి సానుభూతిపరులుగా సదరు మహిళ కుటుంబం మారింది.
పల్నాడు: గురజాలలో వైసీపీ వర్గీయులు దాడి చేస్తున్నారని ఓ మహిళ ఆరోపించింది. కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ ఇంటిపై బాటిల్స్‌తో దాడి చేశారు. వైసీపీ నుంచి ఇటీవల టీడీపీకి సానుభూతిపరులుగా సదరు మహిళ కుటుంబం మారింది. ఇటీవల ముస్లిం కాలనీలో జరిగిన ఘర్షణను మహిళ కుమారుడు వీడియో తీశాడు. ఘర్షణ వీడియోను తీసిన కారణంగానే దాడి చేశారని బాధిత మహిళ చెబుతోంది. గంజాయి అమ్మకాల అనుమానంతో రాత్రి మహిళ దుకాణంలో సోదాలు నిర్వహించారు.