తుని టీడీపీ ఇన్‌చార్జిగా యనమల దివ్య
ABN , First Publish Date - 2023-02-04T04:23:52+05:30 IST
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను పార్టీ అధిష్ఠానం నియమించింది.
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను పార్టీ అధిష్ఠానం నియమించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా కర్రోతు బంగార్రాజును, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా హెలెన్‌ను నియమించారు. కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గ పార్టీకి ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా గంటి హరీశ్ మాథుర్‌ను, కో కన్వీనర్‌గా నామన రాంబాబును నియమించారు.