Share News

వాహ్‌.. కరెంటు వాడకున్నా బిల్లు బాదుడా?: లోకేశ్‌

ABN , First Publish Date - 2023-11-10T03:53:47+05:30 IST

‘ఒక్క యూనిట్‌ కరెంటు కూడా వాడని ఇంటికి రూ.295 బిల్లు బాదుడు.. వాహ్‌!’ అని ఎద్దేవా చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ’ఎక్స్‌’లో ట్వీట్‌

 వాహ్‌.. కరెంటు వాడకున్నా బిల్లు బాదుడా?: లోకేశ్‌

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘ఒక్క యూనిట్‌ కరెంటు కూడా వాడని ఇంటికి రూ.295 బిల్లు బాదుడు.. వాహ్‌!’ అని ఎద్దేవా చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ’ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ‘సొంత పేపర్‌, చానల్‌, సిమెంట్‌, విద్యుత్‌ కంపెనీలు, ఊరికో ప్యాలెస్‌ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్‌రెడ్డి.. పేదలకు రూపాయి స్కీమ్‌ ఇచ్చి, వెయ్యి రూపాయలు దోచే స్కామర్‌.. జనాన్ని క్యాన్సర్‌ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు.. బిడ్డ ఎలా అవుతావు జగన్‌?’ అని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-10T03:53:48+05:30 IST