ప్రైవేట్‌ పార్ట్స్‌ కనిపించేలా నైటీల్లో మహిళలు

ABN , First Publish Date - 2023-03-26T03:34:52+05:30 IST

మహిళలు, పురుషుల వస్త్రధారణపై తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి రాజశేఖర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేట్‌ పార్ట్స్‌ కనిపించేలా నైటీల్లో మహిళలు

పురుషులు జీన్స్‌ వేసుకోవడం వల్లే సంతానలేమితో బాధపడుతున్నారు

తిరుపతి డీపీవో వ్యాఖ్యలు

సత్యవేడు, మార్చి 25: మహిళలు, పురుషుల వస్త్రధారణపై తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి రాజశేఖర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల వద్ద ఎక్కువగా నైటీల్లో ఉంటున్న మహిళలు ఒంటిపై చిన్న పాటి టవల్‌ గుడ్డ కూడా వేసుకోవడం లేదన్నారు. ఇల్లు, వాకిళ్లు ఊడ్చినప్పుడు ప్రైవేటు పార్ట్స్‌ సైతం బయటకు కనబడే విధంగా మహిళల నైటీల ధారణ ఉంటుందన్నారు. పురుషులు పంచె కట్టును వదిలి, జీన్స్‌ ప్యాంట్‌ ధరించడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయి సంతానలేమితో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగనన్న సంకల్ప శిక్షణలో భాగంగా సత్యవేడులోని బృందావనంలో జరుగుతున్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే బృందావనాల, వీధిలైట్ల నిర్వహణ గాడి తప్పిందని ఆరోపించారు. తిరుపతి జిల్లాలో 774 బృందావనాలుండగా ఐదు కేంద్రాల్లో మాత్రమే నిర్వహణ సక్రమంగా ఉందని, మిగిలిన బృందావనాలన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛ సంకల్ప లక్ష్యం నెరవేరాలంటే పంచాయతీ సెక్రటరీల్లో మార్పు రావాల్సి ఉందన్నారు.

Updated Date - 2023-03-26T03:34:52+05:30 IST