ఏకగ్రీవం ఎందుకు చేయలేదు?

ABN , First Publish Date - 2023-03-02T03:12:53+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేయకపోవడం పట్ల సీఎం జగన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఏకగ్రీవం ఎందుకు చేయలేదు?

‘పశ్చిమ’ ఎమ్మెల్సీలు రెండూ గెలవాలి

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ క్లాస్‌

రాజమహేంద్రవరం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేయకపోవడం పట్ల సీఎం జగన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానం ఏకగ్రీవమైనప్పుడు, ఇక్కడ ఎందుకు కాలేదని ప్రశ్నించినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు కుమార్త్తె సౌమ్య వివాహ రిసెప్ష్షన్‌కు బుధవారం హాజరైన సీఎం.. హెలిప్యాడ్‌ వద్ద సుమారు 20 నిమిషాలపాటు గోదావరి జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార్లతో ఆయన సమీక్షించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఐదుగురు పోటీలో ఉన్నారు. ఎన్నిక అనివార్యం కావడంపై జగన్‌ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రెండు స్థానాలూ గెలవాలని, అందరూ ఐక్యంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది.

Updated Date - 2023-03-02T03:12:53+05:30 IST