Share News

గ్రామానికి ఏం చేశావ్‌?

ABN , First Publish Date - 2023-11-29T04:34:08+05:30 IST

మా గ్రామానికి నాలుగున్నరేళ్లలో ఏం చేశావ్‌? ఊరిలో ఉన్న సచివాలయాన్ని మీ నాయకులు చెప్పారని పక్కూరికి తరలిస్తావా?’ అంటూ అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిని జనం నిలదీశారు.

గ్రామానికి ఏం చేశావ్‌?

శింగనమల ఎమ్మెల్యే భర్తను నిలదీసిన జనం

శింగనమల, నవంబరు 28: ‘మా గ్రామానికి నాలుగున్నరేళ్లలో ఏం చేశావ్‌? ఊరిలో ఉన్న సచివాలయాన్ని మీ నాయకులు చెప్పారని పక్కూరికి తరలిస్తావా?’ అంటూ అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిని జనం నిలదీశారు. శింగనమల మండలం రాచేపల్లిలో మంగళవారం ‘గడప గడపకు కార్యక్రమం’ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి రాగానే.. గ్రామస్థులు ఆయనను చుట్టుముట్టారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటుచేసే వరకు తమ ఊరికి రావద్దంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, తాగునీటి సమస్యపై స్థానికులను సాంబశివారెడ్డిని నిలదీశారు.

Updated Date - 2023-11-29T04:34:19+05:30 IST