Magha Masam 2023: ఈ మాఘ మాసంలో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయంటే..

ABN , First Publish Date - 2023-01-21T17:14:37+05:30 IST

‘శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’. ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఘట్టం పెళ్లి.. అటువంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే..

Magha Masam 2023: ఈ మాఘ మాసంలో మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయంటే..

‘శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’. ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఘట్టం పెళ్లి.. అటువంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే.. ఎవరైనా వెంటనే చెప్పే మాసం.. మాఘమాసం.. ఎందుకంటే పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలోను ఉండవని పండితులు, పురోహితులు చెబుతున్నారు. అందుకే అందరూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలోని ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేసుకుంటే.. దాంపత్య జీవితం నిండు నూరేళ్ల పాటు సుఖ, సంతోషాలతో ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.

మాఘ మాసం ఈనెల 22 నుంచి ప్రారంభం కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా పెళ్లి సందడి సంతరించుకుంది. ఈ మాసంలో పదకొండు ముహూర్తాలు ఉండడంతో వేలాది జంటలు మాంగల్య బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లివారు వివాహ వేడుకలకు సిద్ధమవుతుండగా.. కల్యాణ మండప యజమానులు, పురోహితులు, కేటరింగ్‌ వారు పచ్చిపూల మండపాలు వేసేవారు పనుల్లో నిమగ్నమవుతున్నారు. పచ్చిపూల మండపాలు లక్షల్లో పలుకుతున్నాయి. క్యాటరింగ్‌, పురోహితులు, షామియానా, కార్‌ ట్రావెల్స్‌ వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయి.

ముహూర్తాలివి..

ఈ సీజన్‌లో ఈనెల 25, 26, 27, 28 తేదీలు, ఫిబ్రవరి 1, 8, 9, 10, 11, 12, 15 వరకు మంచి ముహూర్తాలున్నాయిని పురోహితులు చెబుతున్నారు.

బలమైన ముహూర్తాలు..

ఈ మాసంలో అన్ని నక్షత్రాల వారికి బలమైన ముహూర్తాలొచ్చాయి. అందులో ఎనిమిది మరింత మంచివి. ఈ నెల 25, 26, 27, 28, ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీల్లో మరిన్ని పెళ్లిళ్లు జరుగుతాయి. ఆ తరువాత వచ్చే ఫాల్గుణ మాసం శూన్యమాసమని వివాహాలు పెద్దగా జరుగవు. ఆ తర్వాత ఉగాది అనంతరం మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 25 వరకు గురుమౌడ్యమి కారణంగా పెళ్లిళ్లు జరుగవు.

- గోవిందవ ఝల వెంకటరమణమూర్తిశర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల

Updated Date - 2023-01-21T17:16:27+05:30 IST