Share News

వచ్చే ఎన్నికల్లో దళితుల సత్తా చూపిస్తాం

ABN , First Publish Date - 2023-11-29T04:32:34+05:30 IST

వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, బెదిరింపులు చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.

వచ్చే ఎన్నికల్లో దళితుల సత్తా చూపిస్తాం

ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది

జగన్‌కు ఇంకా అర్థం కాలేదా?.. కాకినాడ యువతి నిప్పులు

కాకినాడ క్రైం, నవంబరు 28: ‘వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, బెదిరింపులు చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. చెత్తను కూడా వదలకుండా పన్ను వేయడం ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనం. జగన్‌కు అర్థం కాలేదా.. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వసనీయత కోల్పోయింది’ అని కాకినాడకు చెందిన బొజ్జా ఐశ్వర్య అనే యువతి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాకినాడ నగరంలో మంగళవారం ఆమె ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘తమ భవిష్యత్‌ను మారుస్తాడని జగన్‌కు ఓట్లే వేసి గెలిపించిన యువత ఇప్పటికి నిరుద్యోగులుగానే ఉండిపోయారు.. ఈ ప్రభుత్వానికి వారే బుద్ధిచెబుతారు’ అని అన్నారు. ‘అప్పట్లో కాకినాడలో జగన్‌కు మద్దతుగా తొలుత మాట్లాడింది నేనే.. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపేందుకు ముందుగా నేనే మాట్లాడుతున్నా’ అని ఆమె తెలిపారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యా. ఆయన మరణించిన నాటి నుంచి వైఎన్‌ జగన్‌ పెట్టిన వైసీపీ వెంట నడిచా. 2019లో వైసీపీ విజయానికి నేను సైతం అంటూ పనిచేశా. జగన్‌ గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టేదాకా నిద్రహారాలు మాని కష్టపడి పనిచేశా. కానీ మాకుగాని, రాష్ట్ర ప్రజలకుగాని జగన్‌ ఏం చేశాడు’ అని ఆమె నిప్పులు చెరిగింది. జగన్‌ దళితులకు మాయమాటలు చెప్పి వారి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి కార్ల లోన్‌లు వంటివెన్నో సబ్సిడీలో వచ్చేవని, ఈ పథకం ఇప్పుడు ఎస్సీలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. చాలామందికి ఇళ్లు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారని, అలాగే పెన్షన్లు రావడం లేదని తన వద్ద వాపోతున్నారని ఐశ్వర్య చెప్పారు. తన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన తర్వాత కొంతమంది వైసీపీ వాళ్లు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, అయినా భయపడేది లేదని చెప్పారు. ‘2024లో ఓటర్లంటే ఏంటో చూపిస్తాం.. ఈ ప్రభుత్వాన్ని దింపే దాకా నిద్రపోను’ ఆమె చెప్పారు.

Updated Date - 2023-11-29T04:32:36+05:30 IST