Share News

రోడ్డెక్కిన వలంటీర్లు

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:54 AM

తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలని వార్డు వలంటీర్లు డిమాండ్‌ చేశారు.

రోడ్డెక్కిన వలంటీర్లు

ఉద్యోగ భద్రత, వేతనాల పెంపునకు డిమాండ్‌

మహారాణిపేట/డాబాగార్డెన్స్‌(విశాఖపట్నం), ఒంటిమిట్ట(కడప జిల్లా), డిసెంబరు 27: తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలని వార్డు వలంటీర్లు డిమాండ్‌ చేశారు. బుధవారం విశాఖ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టి, అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరారు. అంతకుముందు పలు వార్డుల వలంటీర్లు డాబాగార్డెన్స్‌ సరస్వతీ పార్కు వద్ద నిరసన తెలిపారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వలంటీర్ల సేవలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలోనూ ఎంపీడీవో కార్యాలయంవద్ద వేతనాలు పెంచాలంటూ వలంటీర్లు నిరసన తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 03:54 AM