Vishnu Kumar Raju : రాష్ట్రంలో రాజకీయ వేట మొదలైంది!
ABN , First Publish Date - 2023-06-14T03:25:12+05:30 IST
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి, ముఖ్యమంత్రి జగన్ మాత్రం దేశంలోనే ‘సంపన్న సీఎం’గా పేరు తెచ్చుకున్నారని, ఇక్కడి పాలనకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు.
అవినీతి పాలనపై బీజేపీ ఉక్కుపాదం: విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి, ముఖ్యమంత్రి జగన్ మాత్రం దేశంలోనే ‘సంపన్న సీఎం’గా పేరు తెచ్చుకున్నారని, ఇక్కడి పాలనకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఏనాడూ వైసీపీకి అండగా లేదన్నారు. రాష్ట్రంలో ఈ నెల పదో తేదీన రాజకీయ వేట మొదలైందని, అవినీతి పాలనపై బీజేపీ ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. విశాఖలో భూ కుంభకోణాలపై రెండు సిట్‌లు వేశారని, ఒక్క నివేదికను కూడా బయటపెట్టకుండా కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. జగన్ గత ఎన్నికల్లో సింగిల్‌గానే వచ్చినా ప్రజల్ని మభ్యపెట్టి గెలిచారని, రాబోయే ఎన్నికల్లో సింగిల్‌గానే వచ్చి.. సింగిల్‌గానే వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు.