VijayaSai Reddy: నారాయణ హృదయాలయకు విజయసాయి.. తారకరత్న భార్యే కారణం..!

ABN , First Publish Date - 2023-02-01T18:28:33+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (VijayaSai Reddy) బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Bangalore Narayana Hrudayalaya) హాస్పిటల్‌కు వెళ్లారు. గుండెపోటు కారణంగా చికిత్స పొందుతున్న..

VijayaSai Reddy: నారాయణ హృదయాలయకు విజయసాయి.. తారకరత్న భార్యే కారణం..!

తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి మరెవరో కాదు విజయసాయిరెడ్డికి స్వయానా మరదలి కూతురు. విజయసాయిరెడ్డి భార్య, తారకరత్న అత్తయ్య అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. తారకరత్న కొద్ది మంది సమక్షంలో హైదరాబాద్ నగర శివారులోని సంఘీ టెంపుల్‌లో అలేఖ్యా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తారకరత్నకు విజయసాయిరెడ్డి వరుసకు మామయ్య అవుతారు.

తారకరత్న భార్య కుటుంబానికి టీడీపీ పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది. తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్యా రెడ్డి (TarakaRatna Wife Alekhya Reddy) మరెవరో కాదు చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావడం గమనార్హం.

Updated Date - 2023-02-19T13:07:57+05:30 IST