విత్తన విక్రయాలపై విజి‘లెన్స్‌’

ABN , First Publish Date - 2023-06-01T05:17:39+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విత్తన విక్రయ దుకాణాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

విత్తన విక్రయాలపై విజి‘లెన్స్‌’

● తొమ్మిది కేసులు నమోదు

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విత్తన విక్రయ దుకాణాల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు జిల్లాల్లో 61 చోట్ల తనిఖీలు జరిపి, విత్తన నిల్వలు, రికార్డుల్లో వ్యత్యాసాలున్న తొమ్మిది విక్రయ కేంద్రాలపై సెక్షన్‌ 6ఏ కింద కేసులు నమోదు చేశారు. రూ.10.49 లక్షల విలువైన 38,975 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 19 విక్రయ కేంద్రాల్లో 314 క్వింటాళ్ల విత్తనాలను విక్రయించరాదని డీలర్లను ఆదేశించినట్లు విజిలెన్స్‌ అధికారులు మీడియాకు తెలిపారు.

Updated Date - 2023-06-01T05:17:39+05:30 IST