త్వరలో తిరుపతికి వందే భారత్ రైలు
ABN , First Publish Date - 2023-02-01T03:26:45+05:30 IST
త్వరలోనే తిరుపతికి వందే భారత్ రైలు రానుంది. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రధాని సికింద్రాబాద్ పర్యటనలో భాగంగా ప్రారంభించే అవకాశాలున్నాయి.
నెల్లూరు, గుంటూరు, నడికుడి మీదుగా సికింద్రాబాద్‌కు
రేణిగుంట, జనవరి 31: త్వరలోనే తిరుపతికి వందే భారత్ రైలు రానుంది. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రధాని సికింద్రాబాద్ పర్యటనలో భాగంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్, నడికుడి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి మార్గంలో దీన్ని నడిపేందుకు ట్రయల్‌రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు ద్వారా 661 కిలోమీటర్ల దూరాన్ని 8 నుంచి 9 గంటలలోపు చేరుకునే అవకాశం ఉంది. టికెట్ ధరలను ఏసీ చైర్‌కార్‌లో రూ.1,610, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో రూ.3,050గా నిర్ణయించే అవకాశం ఉంది.