జగన్‌ పాలనలో యూరియా కరువే: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2023-03-02T03:19:29+05:30 IST

దేశంలో ఆహార కొరత వల్లే ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చిందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

జగన్‌ పాలనలో యూరియా కరువే: సోమిరెడ్డి

వెంకటగిరి, మార్చి 1: దేశంలో ఆహార కొరత వల్లే ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చిందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ హయాంలో ఎరువుల నుంచి వ్యవసాయ పనిముట్ల వరకు సబ్సిడీపై రైతులకు అందజేస్తే నేడు కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు.

Updated Date - 2023-03-02T03:19:29+05:30 IST