ఉప్పుటేరు ఊసేది?

ABN , First Publish Date - 2023-03-31T00:33:31+05:30 IST

ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణం కలగానే మిగిలేలా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శం కుస్థాపన చేసిన పనులకే అతీగతీ లేకుండా పోతోంది. టెండర్లు పిలవకుండానే సీఎం శంకు స్థాపన చేయడం ఒక పొరపాటు కాగా, సవరిం చిన అంచనాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేయకపోవడం మరో తప్పిదం.

ఉప్పుటేరు ఊసేది?

నెలలు గడుస్తున్నా

కానరాని పాలనా

అనుమతులు

పెరుగుతున్న అంచనా

వ్యయం.. పట్టించుకోని ప్రభుత్వం

కోటలు దాటుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారుల మాటలు

వేసవిలోనే పనులు చేయాలి.. వర్షాకాలంలో ఏం చేయలేం.. పశ్చిమపై ఉప్పు ముప్పు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణం కలగానే మిగిలేలా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శం కుస్థాపన చేసిన పనులకే అతీగతీ లేకుండా పోతోంది. టెండర్లు పిలవకుండానే సీఎం శంకు స్థాపన చేయడం ఒక పొరపాటు కాగా, సవరిం చిన అంచనాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేయకపోవడం మరో తప్పిదం. గత ఏడాది నవంబరులో సీఎం నర్సాపురం వచ్చిన ప్పుడు మొగల్తూరు మండలం మోళ్లపర్రు వద్ద ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మించేందుకు వర్చు వల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. అధికారు లు దీనిపై ప్రకటనలు గుప్పించారు. తీరా చూస్తే పరిపాలన అనుమతులే మంజూరు కాలేదు. ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే టెండ ర్‌లు పిలవనున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. అయినా అటు నుంచి ఎటువంటి స్పందన లేదు. వేసవి లోనే పనులు చేపట్టాలి. వర్షాకాలంలో ఉప్పు టేరులో వరద నీరు ప్రవహిస్తుంది. అటువం టప్పుడు పనులు చేపట్టేందుకు వీలుకాదు. అంటే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇక రెగ్యులేటర్‌లు నిర్మాణం లేనట్టే లెక్క.

అంచనాలు ఘనం

ఉప్పుటేరుపై మోళ్లపర్రు, పడతడిక, దుంపగడప వద్ద మూడు రెగ్యులేటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపా దనలు సిద్ధం చేసింది. మూడు రెగ్యులేటర్‌లకు రూ.360 కోట్లతో అంచనాలు రూపొందించారు. మూడు పర్యాయా లు టెండర్‌లు పిలిచినా కాంట్రాక్టర్‌లు కన్నెత్తి చూడలే దు. ఏడాది గడిచింది. ధరలు పెరిగిపోయాయి. పాత ధరలతో టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్‌లు వచ్చే అవకాశం లేదు. అధికారులు అంచనాలను సవరించారు. మూడు రెగ్యులేటర్‌లకు రూ.420 కోట్ల వ్యయం అవుతుందని నిర్ధారించారు. పరిపాలన అనుమతుల కోసం సవరించి న అంచనాలను ప్రభుతానికి పంపారు. అటు నుంచి కనీస స్పందన లేకపోయింది. సీఎం శంకుస్థాపన చేసిన తర్వాత అయినా అనుమతులు ఇస్తారని నీటిపారుదల శాఖ అధికారులు భావించారు. అయినా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం విడ్డూరం.

పాపం ప్రభుత్వానిదే

ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయదన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదు. అంచనాలు సవరిస్తే వస్తారన్న అభిప్రాయంతో అధికారులు ఉన్నా రు. తీరా ప్రభుత్వానికి అంచనాలు పంపితే అనుమతు లు మంజూరు చేయడం లేదు. ఉప్పుటేరు రెగ్యులేటర్‌లు నిర్మించకపోతే డెల్టాకు ముప్పు తప్పదు. ఇప్పటికే పశ్చిమ డెల్టా ఉప్పుటేరు పరివాహక ప్రాంతమంతా ఉప్పుకయ్యగా మారుతోంది. భూగర్భ జలాలు ఉప్పుగా మారిపోతున్నాయి. కొల్లేరు సరస్సులోకి ఉప్పు నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల మంచినీటి సర స్సుకు పెను ప్రమాదం తలెత్తుతోంది. డెల్టా ప్రాంతం సస్య శ్యామలం గా ఉండాలన్నా, కొల్లేరు సరస్సు పరిరక్షించాలన్నా ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌లు అనివార్యం. దానిపైనే ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోంది.

వేసవి నిధులైనా మంజూరు చేస్తారా?

రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం వేల కోట్లు జల వనరుల శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాని, ఆచరణ లో తుస్సు మనిపిస్తోంది. వేసవిలో చేపట్టే పనులకు బిల్లులు మంజూరు చేయడం లేదు. ప్రస్తుత వేసవిలో పంట కాలువలు, డ్రైనేజీల మరమ్మతుల కోసం రూ.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వానికి పంపారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ఉన్నతాధికారులు సమావేశమై ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది. అప్పుడైనా నిధులు మంజూరు చేస్తే టెండర్లు పిలిచి వేసవి పనులైనా చేపట్టే అవకాశం ఉంటుంది. అది జిల్లా అధికారులు కాంట్రాక్టర్లను బ్రతిమాలుతున్నారు. పనులు చేపట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఒకటికి రెండుసార్లు టెండర్‌లు పిలవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు.

Updated Date - 2023-03-31T00:33:31+05:30 IST