చంద్రబాబు అరెస్టుతో మరో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2023-10-03T03:17:37+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ అభిమానులు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు.

చంద్రబాబు అరెస్టుతో మరో ఇద్దరు మృతి

ఏలూరు రూరల్‌/ చాట్రాయి, అక్టోబరు 2: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ అభిమానులు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఏలూరులోని కట్టా సుబ్బారావు తోటకు చెందిన గుత్తా బాబూ రాజేంద్రవర ప్రసాద్‌ (62) సెంట్రల్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ ఏలూరు శాఖలో పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఇటీవల చంద్రబాబు అరెస్టు అయిన రోజు నుంచి మానసికంగా ఆందోళన చెందుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు వచ్చిందని, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చాట్రాయి మండలం కోటపాడు టీడీపీ కార్యదర్శి వేముల రామారావు (55) గుండెపోటుతో మృతి చెందారు.

Updated Date - 2023-10-03T03:17:37+05:30 IST