TTD: టీటీడీ ఉద్యోగి చేతివాటం

ABN , First Publish Date - 2023-03-30T17:24:18+05:30 IST

టీటీడీ ఉద్యోగి (TTD employee) చేతివాటం ప్రదర్శించారు.

TTD: టీటీడీ ఉద్యోగి చేతివాటం

కడప: టీటీడీ ఉద్యోగి (TTD employee) చేతివాటం ప్రదర్శించారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి (Ontimitta Kodandarama Swami) ముత్యాల తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్న సమయంలో టీటీడీ ఉద్యోగి అపహరణకు పాల్పడ్డారు. ముత్యాల మూట నుంచి కొన్ని తలంబ్రాలు అపహరించారు. టీటీడీ సూపరింటెండెంట్ రమేష్ ముత్యాలను చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ సమయంలోనూ టీటీడీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల శ్రీవారి దర్శన బ్లాక్‌ టికెట్ల దందా గుట్టురట్టయింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు (police) పట్టుకున్నారు. 12 టికెట్లను రూ.38 వేలకు భక్తులకు దళారీ కరుణాకర్‌ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. కాణిపాకం ఆలయం (Kanipakam temple)లో కాంట్రాక్ట్‌ గ్యాస్ ఆపరేటర్‌గా కరుణాకర్‌ పనిచేస్తున్నాడు. కాణిపాకం ఆలయ పీఆర్‌వో అంటూ తిరుమలలో చలామణి అవుతున్నాడు. గతంలోనూ దర్శన టికెట్లు అమ్ముతూ నిందితుడు పట్టుబడ్డాడు. ఏఈవో మాధవ్‌రెడ్డితో కలిసి సుపథం టికెట్లు అమ్మినట్లు సమాచారం. ఎఫ్‌ఐఆర్ కాపీ ఆధారంగా ఏఈవోకు ఈవో మెమో జారీ చేయనున్నారు.

Updated Date - 2023-03-30T17:24:49+05:30 IST