శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
ABN , First Publish Date - 2023-05-01T03:42:08+05:30 IST
: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రాక మొదలైంది.
తిరుమల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రాక మొదలైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నుంచి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా వీరికి దాదాపు 20 గంటల దర్శన సమయం పడుతోంది.