Typhoon Michoung : తుఫాన్ తెచ్చిన కష్టం
ABN , First Publish Date - 2023-12-11T02:35:02+05:30 IST
మిచౌంగ్ తుఫాన్ పొగాకు రైతులనూ దెబ్బతీసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో రెల్పుకు సిద్ధంగా ఉన్న తోటలు ఇటీవలి తుఫానుకు పూర్తిగా నీటిలో నాని వేళ్లు
పొగాకు పంటను దున్నేసిన రైతు
దేవరపల్లి, డిసెంబరు 10: మిచౌంగ్ తుఫాన్ పొగాకు రైతులనూ దెబ్బతీసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో రెల్పుకు సిద్ధంగా ఉన్న తోటలు ఇటీవలి తుఫానుకు పూర్తిగా నీటిలో నాని వేళ్లు కుళ్లిపోవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. దేవరపల్లి గ్రామానికి చెందిన నందిగం శ్రీధర్ 35 ఎకరాలు కౌలుకు తీసుకుని తోట వేశారు. అక్టోబరులో నాట్లు వేయగా జనవరి మొదటి వారంలో ఆకు రేల్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తుఫాన్‌తో వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆదివారం 20 ఎకరాల వరకు దున్నేశాడు. సుమారు రూ.20 లక్షల నష్టం వచ్చిందని వాపోయాడు. తోటను దున్నేసి మళ్లీ నాట్లు వేయాలంటే రూ.50 వేలు ఖర్చువుతుంది. పొగాకు నాట్లు వేయడానికి నారు అందుబాటులో లేదు. నారు కూడా ఎకరానికి రూ.16వేలు పలుకుతోందని ఆయన వాపోయాడు. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.