నేడు రాష్ట్రానికి కేంద్ర పంచాయతీ అధికారులు
ABN , First Publish Date - 2023-09-26T04:47:05+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.8,660 కోట్లు రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ నేతలు

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.8,660 కోట్లు రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసిన నేపఽథ్యంలో కేంద్ర అధికారులు స్పందించారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం వరగాని, కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, మచిలీపట్నం మండలంలోని పెద్ద యాదరలో కేంద్ర అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారమిచ్చారు.