CM JAGAN: సీఎం పర్యటనతో హైరానా

ABN , First Publish Date - 2023-07-21T03:17:55+05:30 IST

ముఖ్యమంత్రి పర్యటనలో జనసమీకరణకు నేతలు టార్గెట్లు విధించడంతో అధికారులు హైరానా పడిపోతున్నారు.

CM JAGAN: సీఎం పర్యటనతో   హైరానా

అధికారులకు జనసమీకరణ టార్గెట్లు

ఉపాధి కూలీలకు ఒక రోజు మస్టరు

రాకపోతే పథకాలు ఆపేస్తామంటున్న వలంటీర్లు

వెంకటగిరి, జూలై 20: ముఖ్యమంత్రి పర్యటనలో జనసమీకరణకు నేతలు టార్గెట్లు విధించడంతో అధికారులు హైరానా పడిపోతున్నారు. సీఎం జగన్‌ శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనకు వస్తుండడంతో జనసమీకరణకు 750 ఆర్టీసీ బస్సులతోపాటు 500 స్కూల్‌ బస్సులు, ప్రైవేటు బస్సులను ఏర్పాటుచేశారు. ఉపాధి కూలీలు, పొదుపు మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో వాహనాలను నింపాలని శాఖలవారీగా టార్గెట్లు విధించారు. ఉపాధి కూలీలు సీఎం సభకు వస్తే ఒకరోజు మస్టరు అదనంగా వేసి కూలిడబ్బులు చెల్లిస్తామని గ్రామ స్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చెబుతున్నారు.

పొదుపు మహిళలు, పింఛనుదారులు, వివిధ పథకాల లబ్ధిదారులు సీఎం సభకు రాకపోతే పథకాలు నిలిపివేస్తామని వలంటీర్లు హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే జనానికి ఉదయం అల్పాహార ప్యాకెట్లు అందజేసే బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించినట్లు తెలిసింది. గురువారం నుంచే వెంకటగిరిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో జనం ఇబ్బందులెదుర్కొంటున్నారు. సీఎం పర్యటించే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి గంటల తరబడి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన జనం గమ్యం చేరేందుకు హైరానా పడిపోయారు. పాఠశాలలు వదిలే సమయంలో సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ పెట్టడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. సీఎం రాక నేపథ్యంలో పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను జనసమీకరణకు తీసుకెళ్లడంతో సెలవు అనివార్యమైంది. సభాప్రాంగణం, హెలిప్యాడ్‌, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి విగ్రహ ఆవిష్కరణ ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని నిఘా కట్టుదిట్టం చేశారు. సీఎం సభవద్ద రంగవల్లుల బాధ్యతను అంగన్‌వాడీలకు అప్పగించడంతో 50మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో తలమునకలయ్యారు. మహిళలు అధికంగా కన్పించేలా సభా ప్రాంగణంలో ఓ వైపు 3500 మంది పొదుపు మహిళలుండేలా చూసే భాద్యతను వెలుగు సిబ్బందికి కేటాయించినట్లు తెలిసింది. చేనేతలు అధికంగా ఉన్న వెంకటగిరిలో ఆ సామాజిక వర్గం నుంచి మహిళలను ఎక్కువ సంఖ్యలో తరలించాలని అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

‘కోటా’ ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ మెటీరియల్‌ సిద్ధం

హైదరాబాద్‌ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): 6, 7, 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ‘కోటా’ ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ స్టడీ మెటీరియల్‌, అసైన్‌మెంట్స్‌ సిద్ధం చేసినట్లు కోటా పేజేస్‌ తెలిపింది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ఫౌండేషన్‌ మెటీరియల్‌ను డిజిటల్‌ మొబైల్‌ వెర్షన్‌లో వాట్సాప్‌ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. అలాగే స్టడీ మెటీరియల్‌తో పాటు అసైన్‌మెంట్స్‌ను పొందవచ్చని, మరింత సమాచారం కోసం ఐఐఖీ ఊ, కఉఈ ఊ అని టైపు చేసి 98490 16661 నంబరుకు వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలని సూచించింది.

Updated Date - 2023-07-21T03:17:55+05:30 IST