శ్రీవారి ఆలయంలో నేటి నుంచి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:10 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నుంచి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠించనున్నారు.
తిరుమల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నుంచి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠించనున్నారు.శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘడియలు 16వ తేదీ అర్ధరాత్రి తరువాత 12.34 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున స్వామికి సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు.