అర్ధవీడు మండలంలో పులి సంచారం

ABN , First Publish Date - 2023-01-25T04:21:05+05:30 IST

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం అటవీ సమీప గ్రామాలను పెద్దపులి వణికిస్తోంది.

అర్ధవీడు మండలంలో పులి సంచారం

ఆవుపై దాడి.. భయాందోళనలో రైతులు, గ్రామస్థులు

అర్ధవీడు (కంభం), జనవరి 24: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం అటవీ సమీప గ్రామాలను పెద్దపులి వణికిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే మాగుటూరు, కాకర్ల, వెలగలపాయ పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తోంది. అటవీప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడిచేసి చంపినట్లు అధికారులు నిర్ధా రించారు. అర్ధవీడు మండలం వెలగలపాయ లోయలోని మాగుటూరు గ్రామానికి చెందిన బోగెం గురుస్వామికి చెందిన ఆవులను రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేతకు వదిలాడు. అయితే సాయంత్రానికి ఇంటికి వచ్చిన ఆవుల్లో ఒకటి కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం గురుస్వామి ఆవును వెతుకుతూ అడవిలోకి వెళ్లగా ఒకచోట దాని కళేబరం కనిపించింది. పులి దాడి చేసినట్లు ఉండటంతో ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజే శారు. వారు ఘటన స్థలాన్ని పరిశీలించి, పెద్దపులి దాడిలోనే ఆవు మరణించి ఉంటుందని భావించి, నిర్ధారించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఆవు కళేబరం సమీపంలో కెమెరాలను పరిశీలించారు. మరుసటి రోజు కూడా పెద్దపులి ఆవు కళేబరం వద్దకు వచ్చి తిని వెళుతున్న దృశ్యం నమోదైంది. గురుస్వామికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మార్కాపురం రేంజ్‌ అధికారి వేణు తెలిపారు.

Updated Date - 2023-01-25T04:39:55+05:30 IST