మూన్నాళ్ల ముచ్చటేనా..!

ABN , First Publish Date - 2023-09-04T03:29:36+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత ఊరిలో గతేడాది డిసెంబరులో అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ మూన్నాళ్ల ముచ్చటగా మారింది.

మూన్నాళ్ల ముచ్చటేనా..!

చిన్నపాటి వానకే కారుతున్నపులివెందుల వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌

22 కోట్లతో నిర్మాణం.. గత డిసెంబరులోనే ప్రారంభించిన సీఎం జగన్‌

పులివెందుల/పులివెందుల రూరల్‌, సెప్టెంబరు 3: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంత ఊరిలో గతేడాది డిసెంబరులో అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్‌ బస్‌ టెర్మినల్‌ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కొద్దిపాటి వర్షానికే కారుతోంది. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో రూ.22.50 కోట్లతో నిర్మించిన బస్‌ టెర్మినల్‌లో నాణ్యతా లోపాలు కనిపించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో కురిసిన వర్షానికి కూడా పలుచోట్ల గోడల్లో చెమ్మ చేరి ఉరిశాయి. దీంతో మరమ్మతులు కూడా చేపట్టారు. తాజాగా శనివారం రాత్రి కురిసిన వర్షానికి నీరు కిందికి కారడంతో ఆర్టీసీ సిబ్బంది వాటిని శుభ్రం చేస్తూ కనిపించారు. ఏదైనా ఒక నిర్మాణం చేపడితే దాదాపు 20 నుంచి 30 ఏళ్ల దాకా ఎటువంటి మరమ్మతులు చేయకుండా ఉండేలా నిర్మాణం సాగుతుంది. కానీ కొన్ని నెలలకే ఇలా ఉరుస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై సంబంధిత ఏపీఎ్‌సఆర్టీసీ ఈఈ వెంకటరమణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఆయన విషయం తన దృష్టికి రాలేదన్నారు. డీఈతో మాట్లాడి సమస్య పునరావృతం కాకుండా పరిష్కరిస్తామన్నారు. టెర్మినల్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామని తెలిపారు.

Updated Date - 2023-09-04T03:29:36+05:30 IST