మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అనుమతి
ABN , First Publish Date - 2023-07-21T03:21:58+05:30 IST
ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన పథకం కింద రాష్ట్రంలో మూడు చోట్ల ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన పథకం కింద రాష్ట్రంలో మూడు చోట్ల ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు గురవారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రం వాటాతో వీటిని నిర్మించనున్నారు. రూ.23.90 కోట్ల చొప్పున తిరుపతి జిల్లా రాయదరువు, అనకాపల్లి జిల్లా దొండవాకలోనూ, రూ.5.74 కోట్లతో కాకినాడ జిల్లా ఉప్పలంకలోనూ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.