వివాదానికి ముగింపు పలకండి: తోట

ABN , First Publish Date - 2023-06-24T02:10:34+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కాపునేత ముద్రగడ పద్మనాభం వివాదానికి ముగింపు పలకాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు.

వివాదానికి ముగింపు పలకండి: తోట

విజయవాడ(ధర్నాచౌక్‌), జూన్‌ 23: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, కాపునేత ముద్రగడ పద్మనాభం వివాదానికి ముగింపు పలకాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాపు ఉద్యమానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సహకరించాడని ముద్రగడ తన లేఖలో ప్రస్తావించడాన్ని సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లక్రితం ముద్రగడ చేసిన కాపు ఉద్యమం గురించి తెలియక ఆయనపై సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారన్నారు.

Updated Date - 2023-06-24T02:10:34+05:30 IST