యువగళానికి వెళ్లారని పింఛను కట్‌ చేశారు

ABN , First Publish Date - 2023-09-04T03:36:00+05:30 IST

యువగళానికి వెళ్లారన్న సాకుతో గిరిజన తల్లీకూతుళ్ల పింఛను నిలిపివేశారు. బాధితులు ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం కోర్లమండ శివారు నాయకులుగూడెంకు చెందిన వారు.

యువగళానికి వెళ్లారని పింఛను కట్‌ చేశారు

వృద్ధ, దివ్యాంగ గిరిజన మహిళలపై కక్ష సాధింపు

విస్సన్నపేట, సెప్టెంబరు 3: యువగళానికి వెళ్లారన్న సాకుతో గిరిజన తల్లీకూతుళ్ల పింఛను నిలిపివేశారు. బాధితులు ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం కోర్లమండ శివారు నాయకులుగూడెంకు చెందిన వారు. గ్రామానికి చెందిన చింతల అంకమ్మ ఇటీవల గన్నవరంలో జరిగిన యువగళం పాదయాత్రలో పాల్గొంది. ఆ సందర్భంగా సోషల్‌ మీడియాలో మాట్లాడుతూ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఇవ్వాల్సిన పింఛను వలంటీరు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తె చింతల నాగమణికి సైతం పింఛను ఇవ్వలేదు. వలంటీర్‌ను అడిగితే... ‘మీకు పై నుంచే పింఛను రాలేదు’ అని సమాధానం ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గం టీడీపీ నాయకులు బాధితుల్ని పరామర్శించారు. దీనిపై ఎంపీడీవో ఎస్‌.వెంకటరమణను వివరణ కోరగా... రెండు రోజుల్లో వారికి పింఛను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-09-04T03:36:00+05:30 IST