రాజధాని రైతుల త్యాగం వృథా కాదు..!
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:30 AM
రైతుల త్యాగం వృథా కాదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రైతుల నాలుగేళ్ల ఉద్యమానికి మద్దతుగా ఆదివారం ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ..
అన్ని తప్పులనీ మూడు నెలల్లో సరిజేస్తాం: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘రైతుల త్యాగం వృథా కాదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రైతుల నాలుగేళ్ల ఉద్యమానికి మద్దతుగా ఆదివారం ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ఆంధ్రప్రదేశ్‌ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేందుకు భవిష్యత్ నగరం అమరావతిని ఈ ప్రభుత్వం వదిలేసి నాలుగేళ్లు అయింది. అత్యాశ, అసూయతో కూడిన వ్యక్తి జగన్‌రెడ్డి. అతను తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల రాజధానికి భూములిచ్చిన వేలాది మంది రైతులు ఇప్పుడు రోడ్డుపై ఉన్నారు. అన్ని తప్పుల్నీ మూడు నెలల్లో సరిజేస్తాం. జై అమరావతి’ అని పేర్కొన్నారు.