Share News

పంటను కాపాడాలంటూ సీఐ కాళ్లపై పడ్డ రైతు

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:44 AM

‘సార్‌ మిరప పంటకు లక్షల్లో పెట్టుబడులు పెట్టాం. సాగునీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం.

పంటను కాపాడాలంటూ సీఐ కాళ్లపై పడ్డ రైతు

‘సార్‌ మిరప పంటకు లక్షల్లో పెట్టుబడులు పెట్టాం. సాగునీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. న్యాయం జరిగేలా చూడండి’ అంటూ ఈ రైతు పోలీసు అధికారి కాళ్లపై పడ్డాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్‌ కాలువకు సాగు నీరు ఇచ్చి ఆదుకోవాలంటూ అన్నదాతలు శనివారం ఆందోళన చేశారు. రైతులు తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగడంతో పోలీసులను అక్కడకు వచ్చారు. సీఐ ప్రవీణ్‌ కుమార్‌ కాళ్లపై పడ్డ రైతు... నీళ్లిచ్చి తమ పంటలను కాపాడాలంటూ వేడుకున్నాడు.

-విడపనకల్లు

Updated Date - Dec 17 , 2023 | 04:44 AM