Share News

అవుట్‌ సోర్సింగ్‌ సభలో ‘థాంక్యూ సీఎం’ బోర్డు

ABN , First Publish Date - 2023-12-11T01:12:24+05:30 IST

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు గర్జన పేరుతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రథమ మహాసభలో ‘థాంక్యూ సీఎం’ బోర్డు ఏర్పాటు చేయడం

అవుట్‌ సోర్సింగ్‌ సభలో ‘థాంక్యూ సీఎం’ బోర్డు

సజ్జల వస్తున్నారని నేతలపై ఒత్తిడి తెచ్చి పెట్టించిన ఎమ్మెల్యే

విజయవాడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు గర్జన పేరుతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రథమ మహాసభలో ‘థాంక్యూ సీఎం’ బోర్డు ఏర్పాటు చేయడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సభకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిచారు. స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణును కూడా ఆహ్వానించారు. అయితే కార్యక్రమ నిర్వాహకులైన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగ సంఘ నేతలపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి సభా ప్రాంగణంలో ‘థాంక్యూ సీఎం’ అంటూ జగన్‌ బొమ్మతో బోర్డు పెట్టించారు. సజ్జల ముఖ్య అతిథిగా వస్తున్నందున నిరసనగా ఉంటే బాగోదంటూ అడ్‌హాక్‌ కమిటీ నేతలపై ఒత్తిడి తీసుకురావడంతో ఇష్టం లేకపోయినా.. బలవంతంగా బోర్డు పెట్టామని తమను ప్రశ్నించిన సిబ్బందికి వారు చెప్పడం గమనార్హం. తీరా ఈ సభకు సజ్జల రాలేదు. విష్ణు మాత్రమే వచ్చారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోగా.. ఉచితంగా థాంక్యూ సీఎం బోర్డు పెట్టించుకుని ప్రభుత్వ అనుకూల కార్యక్రమంగా మార్చారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-12-11T01:12:25+05:30 IST