ఓటరు జాబితా సవరణ సమావేశంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-08-02T04:02:14+05:30 IST

ఓటరు సవరణ జాబితాపై అనంతపురం జిల్లా ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఓటరు జాబితా సవరణ సమావేశంలో ఉద్రిక్తత

టీడీపీ నాయకులపై దాడికి యత్నించిన వైసీపీ వర్గీయులు

ఉరవకొండ, ఆగస్టు 1: ఓటరు సవరణ జాబితాపై అనంతపురం జిల్లా ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమావేశానికి టీడీపీ, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సమావేశంలో తమ సానుభూతిపరుల ఓట్ల గురించి మాత్రమే ఎందుకు విచారిస్తున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. వైసీపీ సానుభూతిపరుల జాబితా ఇస్తామని, వాటిని కూడా తొలగిస్తారా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో టీడీపీ నాయకులకు వైసీపీ నాయకులు అడ్డుతగిలారు. ఇరు పార్టీల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు తోసుకున్నారు. వైసీపీ నాయకుడొకరు కుర్చీ ఎత్తి టీడీపీ నాయకులపై దాడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఓటరు జాబితాపై సమగ్ర విచారణ చేపడతామని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని టీడీపీ నాయకులకు సీఈవో హామీ ఇచ్చారు.

Updated Date - 2023-08-02T04:02:14+05:30 IST