మీ సమస్యలేమిటో చెప్పండి

ABN , First Publish Date - 2023-09-26T04:49:36+05:30 IST

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలహీన పడిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ తరుణంలో ప్రాంతీయ సమన్వయకర్తగా ఆ జిల్లా ఎమ్మెల్యేలతో వీ విజయసాయిరెడ్డి విడివిడిగా

మీ సమస్యలేమిటో చెప్పండి

నెల్లూరు ఎమ్మెల్యేలతో ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలహీన పడిందన్న ప్రచారం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ తరుణంలో ప్రాంతీయ సమన్వయకర్తగా ఆ జిల్లా ఎమ్మెల్యేలతో వీ విజయసాయిరెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. వారి వారి నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, గౌతంరెడ్డి, అనికుమార్‌ యాదవ్‌, ఎం మహీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి సస్పెన్షన్‌కు గురైన మేకపాటి చంద్రశేఖర రెడ్డి, అనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను పిలవలేదు.

Updated Date - 2023-09-26T04:49:36+05:30 IST