పోరు ఉధృతికి టీడీపీ వ్యూహం

ABN , First Publish Date - 2023-09-26T04:43:14+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన పోరును మరింత ఉధృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీలో కొత్తగా ఏర్పాటయిన రాజకీయ కార్యాచరణ కమిటీ తొలి

పోరు ఉధృతికి టీడీపీ వ్యూహం

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన పోరును మరింత ఉధృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీలో కొత్తగా ఏర్పాటయిన రాజకీయ కార్యాచరణ కమిటీ తొలి సమావేశం మంగళవారం ఇక్కడ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ‘‘కుల మత ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ నిరసనను మరింత ఉధృతంగా ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ కమిటీ సమావేశంలో చర్చిస్తాం. భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేసుకొంటాం’’ అని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు తెలిపారు.

Updated Date - 2023-09-26T04:43:14+05:30 IST