అసెంబ్లీలో వైసీపీ సొంత డప్పు: పంచుమర్తి

ABN , First Publish Date - 2023-09-26T04:44:45+05:30 IST

అసెంబ్లీలో వైసీపీ ప్రజాప్రతినిఽధులు సొంత డప్పు కొట్టుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. చంద్రబాబుని అక్రమ కేసులో ఇరికించి జైలు పాల్జేసిన జగన్‌...

అసెంబ్లీలో వైసీపీ సొంత డప్పు: పంచుమర్తి

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో వైసీపీ ప్రజాప్రతినిఽధులు సొంత డప్పు కొట్టుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. చంద్రబాబుని అక్రమ కేసులో ఇరికించి జైలు పాల్జేసిన జగన్‌... పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘మహిళా బిల్లు గురించి అసెంబ్లీలో వైసీపీ మాట్లాడటం సిగ్గుచేటు. తల్లిని, చెల్లిని రోడ్లపాలు చేసిన జగన్‌కి మహిళా బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 1996లోనే మహిళా బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదీ మహిళాభ్యున్నతి పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధత’’ అన్నారు.

Updated Date - 2023-09-26T04:44:45+05:30 IST