Share News

టీడీపీ 9 మందికి రాజ్యసభ సీట్లిచ్చింది: కళా

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:04 AM

తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తొమ్మిది మంది బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు గుర్తు చేశారు.

టీడీపీ 9 మందికి రాజ్యసభ సీట్లిచ్చింది: కళా

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తొమ్మిది మంది బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు గుర్తు చేశారు. ఒక్క బీసీకి కూడా రాజ్యసభ సీటు ఇవ్వలేదన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు.‘బీసీ నేతలు రూమాళ్ల రామచంద్రయ్య, గుండు సుధారాణి, అల్లాడి రాజకుమార్‌, జయప్రద, కెంబూరి రామ్మోహన్‌ రావు, కళా వెంకట్రావు, దేవేందర్‌గౌడ్‌, ప్రొఫెసర్‌ లక్ష్మన్న, జీ రామచంద్రయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చింది. సామాన్య బీసీలను టీడీపీ రాజ్యసభకు పంపితే, వైసీపీ రూ.కోట్లు తీసుకుని, కార్పొరేట్లకు, పక్క రాష్ట్రాల వారికి సీట్లు ఇచ్చింది’ అని అన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:04 AM