ఆత్మ క్షోభ దినోత్సవంగా జరుపుకొంటే బాగుండేది: వర్ల
ABN , First Publish Date - 2023-07-09T03:13:33+05:30 IST
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆత్మక్షోభ దినోత్సవంగా జరుపుకొంటే సముచితంగా ఉండేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆత్మక్షోభ దినోత్సవంగా జరుపుకొంటే సముచితంగా ఉండేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైస్ బతికున్నంతకాలం జగన్ ఆయనను వేపుకు తిన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నాడు. బతికి ఉన్నప్పుడే జగన్‌ను భరించలేక రాష్ట్రానికి రావద్దని, బెంగళూరులోనే ఉండాలని వైఎస్ చెప్పారు. తాను అడగగానే ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని బాబాయి వివేకానందరెడ్డి చెంపను జగన్ పగలగొట్టాడు. తండ్రి శవం ఉండగానే సీఎం పదవి కోసం సంతకాలు పెట్టించాడు. అధికారంలోకి రాగానే చెల్లిని వెళ్లగొట్టాడు. బాబాయి హంతకులు జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నాడు. తల్లిని పార్టీ పదవి నుంచి పీకేశాడు. ఇన్ని ఘన కార్యాలు చేసిన జగన్... తండ్రి జయంతికి ఆత్మ క్షోభ దినోత్సవంగా పేరు పెడితే సరిపోతుంది’’ అని అన్నారు.