Share News

సుప్రీం తీర్పును అమలు చేయాలి

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:11 AM

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు రామచెన్నమ్మ డిమాండ్‌ చేశారు.

సుప్రీం తీర్పును అమలు చేయాలి
పాములపాడులో అంగన్‌వాడీ వర్కర్ల నిరవధిక దీక్షలు

గడివేముల,డిసెంబరు 21 : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు రామచెన్నమ్మ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి బస్టాండు ఆవరణంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ, వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేశారు.

పదో రోజుకు చేరిన పోరు

ఆత్మకూరు : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ వర్కర్లు చేపడుతున్న నిరసనలు గురువారానికి పదోరోజుకు చేరాయి. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా గౌడ్‌సెంటర్‌కు చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ నిరంకుశ తీరును నిరసించారు. అనంతరం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి మంజుల, సీఐటీయు నాయకులు రజాక్‌, రామ్‌నాయక్‌, రణధీర్‌ మాట్లాడారు. యూనియన్‌ నాయకులు వెంకటలక్ష్మీ, లక్ష్మీదేవీ, రవణమ్మ, ప్రియాంక, చెన్నమ్మ, ఆదిలక్ష్మీ, ప్రశాంతి, కవితాబాయి, నాగమ్మ, వాణి, వసంతకుమారీ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల మానవహారం

మహానంది : సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్లు మహానంది ఆలయం ఎదుట మానవహారం నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి నంది సర్కిల్‌ వద్ద గంట సేపు మానవహారం నిర్వహించారు. యూయన్‌ నాయకులు సావిత్రి, నారాయణమ్మ, పుష్పకళ, పాతిమా మేరి రాణి, కొండమ్మ పాల్గొన్నారు.

వెలుగోడు : పట్టణంలోని ప్రధాన సెంటరులో అంగన్‌వాడీ వర్కర్లు మానవ హారంగా నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తమకు తెలియ కుండా అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగుల గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.

చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన

పాములపాడు: ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంగన్‌వాడీ వర్కర్స్‌ , హెల్పర్స్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. గురువారం మండలకేంద్రంలో చేపట్టిన నిరవధిక దీక్షలు పదోరోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ చెవిలో పువ్వులు ధరించి నిరసన తెలిపారు. యూనియన్‌ నాయకులు శివలక్ష్మి, స్వాతి, మద్దమ్మ, నాగమణి, హెల్పర్లు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల రస్తారోకో

పాణ్యం : అంగన్‌వాడీ వర్కర్లు పాణ్యం బస్టాండు కూడలిలో రస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. సీఐటీయూ సహాయ కార్యదర్శి భాస్కర్‌, నాయకులు వెంకటమ్మ, ప్రజాసంఘాల నాయకులు ప్రతాప్‌, వెంకటాద్రి పాల్గొన్నారు.

సత్తాచాటుతాం

గోస్పాడు : స్థానిక బస్టాండ్‌ ఆవరణలో అంగన్‌వాడీ వర్కర్లు మానవహారం నిర్వహించి అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరవదిక నిరాహార దీక్షలు కొనసాగించారు. యూనియన్‌ నాయకులు రమణమ్మ, నిర్మల, సువర్ణ మాట్లాడుతూ సీఎం జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.

Updated Date - Dec 22 , 2023 | 12:11 AM